హైదరాబాద్ లో ఎన్టీఆర్ టీడీపీ ప్రచారం..కె.సి.ఆర్ కు దిమ్మతిరిగే షాక్..!

హరికృష్ణ మరణం తర్వాత నందమూరి ఫ్యామిలీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ నందమూరి, నారా ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. ఇక 2019 ఎలక్షన్స్ లో ఎన్.టి.ఆర్ ను పార్టీ ప్రచారానికి వాడుకోవాలన్న ఆలోచన ఉందని తెలుస్తుంది. అయితే ఎన్.టి.ఆర్ ను తెలంగాణా వరకు వాడుకుంటారట.
2
అది కూడా తెలంగాణాలో మహాకూటమిలో భాగంగా టిడిపి తరపున కూకట్ పల్లి నియోజక వర్గం నుండి హరికృష్ణ కుమార్తె సుహాసినిని రంగంలో దించుతున్నారు. కూకట్ పల్లి నుండి సుహాసినిని నిలబెట్టేలా ఆలోచన చేస్తున్నారట. దాదాపు ఆమె కన్ఫాం అయినట్టే అంటున్నారు. అయితే అక్క తరపున ప్రచారం చేసేందుకు తమ్ముడు జూనియర్ ను వాడుకోనున్నారట.
1
ఒకవేళ అదే జరిగితే కె.సి.ఆర్ గులాబి పార్టీకి కచ్చితంగా ఎదురుదెబ్బ తగిలినట్టే. టిడిపి, కాంగ్రెస్, టిజేఎస్ కలిసి ఏర్పడిన మహాకూటమి టి.ఆర్.ఎస్ కు గట్టి పోటీ ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారు. టిడిపి తరపున ఎన్.టి.ఆర్ ప్రచారం చేశాడు అంటే అది కచ్చితంగా మహాకూటమికి ప్లస్ అయినట్టే లెక్క.

Leave a comment