పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృధ్వి..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమాత్రం 2019 ఎన్నికల్లో ఉండదని చెబుతున్నారు థర్టీ ఇయర్ పృధ్వి. కేవలం ఆయన్ను చూసేందుకే జనాలు వస్తున్నారు తప్ప ఏపిలో అధికార ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న జనాలు వైసిపికే ఓటు వేస్తారని చెప్పుకొచ్చాడు. ఇక పవన్ ఏం తింటున్నాడో తాను చెప్పలేకపోవచ్చు కాని పవన్ జనసేన హవా ఏంటి అన్నది తాను చెప్పగలనని అన్నారు పృధ్వి.

తాను కూడా స్టేజ్ ఎక్కి వంద మాటలు మాట్లాడుతానని అవి పట్టించుకునే ఓపిక, తీరిక జనాలకు లేదని అంటున్నాడు పృధ్వి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని టిడిపిని వ్యతిరేకించే వారు వైసిపికే ఓటు వేస్తారని అన్నాడు. ఇక మన దగ్గర కేవలం కులం తోనే గెలిచే సంస్కృతి రాలేదని. తాను కాపు వర్గానికి చెందిన్ వాడినే అయినా సరే కాపులంతా పవన్ వైపు ఉన్నారు కదా అని తాను వెళ్లనని అన్నారు. మొత్తానికి పవన్ పార్టీ మీద మొదటిసారి 30 ఇయర్స్ పృధ్వి తన స్పందన తెలియచేశారు.