విరాట్ కొహ్లి : 420*.. మరో ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్..

ఇండియా పరుగుల మిషన్ విరాట్ కొహ్లి ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సీరీస్ లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. నాలుగు వన్డేల్లో 3 సెంచరీలతో ఏ క్రికెటర్ సాధించని అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్ జట్టుతో జరిగిన నాలుగు వన్ డేల్లో మొత్తంగా 400 పరుగులు చేసిన విరాట్ కొహ్లి కెప్టెన్ గా ఒక సీరీస్ లో 400 పరుగులు సాధించడం ఇది రెండోసారి.

మొదటి వన్డేలో 140, రెండో వన్డేలో 157, థర్డ్ వండే 107, ఫోర్త్ వన్ డే 16 పరుగులు చేశాడు. ఈ నాలుగు వన్డేల్లో 400 పరుగులు చేసి విరాట్ కొహ్లి తనకు మాత్రమే సాధ్యమయ్యేలా ఈ రికార్డ్ సృష్టించాడు. ఇక 5 వన్ డేల సీరీస్ లో ఇండియా, వెస్టిండీస్ 2-1తో ఉన్నారు. నవంబర్ 1న జరిగే ఐదవ వన్ డే టై విజేతని డిక్లేర్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇండియా ముందంజలో ఉంది. తిరువునంతపురంలో ఈ 5వ వన్ డే జరుగుతుంది. ఇక తాజాగా కోహ్లీ ప్రస్తుతం ఉన్న ఇతర వన్ డే జట్ల కెప్టెన్లను వెనక్కి నెట్టి తొలి స్థానం లో కొనసాగుతున్నాడు.

1

Leave a comment