రిలీజ్ కు ముందే లాభాల్లో టాక్సీవాలా..?

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో థ్రిల్లర్ మూవీగా వస్తున్న సినిమా టాక్సీవాలా. గీతా ఆర్ట్స్-2, యువి క్రియేషన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇక సినిమా రష్ కూడా బయటకు లీక్ అవడంతో సినిమా మీద బజ్ కూడా ఏర్పడలేదు.

నవంబర్ 16న రిలీజ్ అవుతున్న ఈ సినిమా బడ్జెట్ 6 కోట్లు అయ్యిందట. అయితే శాటిలైట్ రూపంలో ఇప్పటికే రెండున్నర కోట్లు వచ్చాయట. ఎటొచ్చి వసూళ్ల రూపంలో 4 కోట్లు వస్తే చాలు. విజయ్ సినిమా అంటే అది ఒకటి రెండు రోజుల్లో రాబట్టేస్తుంది. అసలు మొదటి రోజే 3 నుండి 4 కోట్లు వచ్చినా రావొచ్చు.

ఎలా చూసినా టాక్సీవాలా సేఫ్ ప్రాజెక్ట్ అన్నట్టే. సినిమా రిలీజ్ కు ముందే సూపర్ హిట్ కొట్టినట్టే. ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక నాయర్, ప్రియాంకా జావల్కర్ నటించారు. ఈమధ్య రిలీజైన ఈ సినిమా సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. నోటా ఫ్లాప్ తర్వాత విజయ్ టాకీవాలా అయినా అతనికి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Leave a comment