సుదీప్ కు భారీ రోడ్డు ప్రమాదం..పరిస్థితి..?

కన్నడ నటుడు సుదీప్ సౌత్ ప్రేక్షకులందరికి సుపరిచితుడే.. ఆయన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక అప్పటి నుండి తెలుగు సినిమాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. బాహుబలి బిగినింగ్ లో కనిపించిన సుదీప్ ప్రస్తుతం సైరా సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇదిలాఉంటే సుదీప్ నటిస్తున్న కన్నడ సినిమా పైల్వాన్ షూటింగ్ లో యాక్షన్ సీన్ లో భాగంగా కారు ప్రమాదం జరిగింది.

అందులో సుదీప్ కు గాయాలయ్యాయట. వెంటనే చిత్రయూనిట్ అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. 2016లో ఒకసారి షూటింగ్ లో గాయాలవగా ఆ దెబ్బ నుండి కోలుకున్న సుదీప్ మరోసారి షూటింగ్ లో యాక్సిడెంట్ హాట్ న్యూస్ గా మారింది. అయితే నిన్న కన్నడ శివ రాజ్ కుమార్ నటించిన ది విలన్ సినిమా వేడుకలకు సుదీప్ అటెండ్ కాలేకపోయాడు. సుదీప్ కూడా ఈ సినిమాలో నటించాడు. అయితే టీజర్ విడుదలకు తాను రాలేనందుకు ఫ్యాన్స్ ఫీలవ్వగా తాను హాస్పిటల్ లో ఉన్నందునే రాలేకపోయానని వివరణ ఇచ్చుకున్నాడు సుదీప్.

ఇక విలన్ సినిమా విషయానికొస్తే అక్టోబర్ 18న ఈ సినిమా రిలీజ్ కానుంది. మిథున్ చక్రవర్తితో పాటుగా తెలుగు హీరో శ్రీకాంత్ కూడా ఈ సినిమాలో నటించారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మల్టీస్టారర్ మూవీగా అక్కడ భారీ క్రేజ్ దక్కించుకుంది.

Leave a comment