“అరవింద సమేత” పై మెగా ఫ్యామిలీ పొగడ్తల వర్షం ..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత సినిమా అంచనాలకు తగినట్టుగా వసూళ్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సెలబ్రిటీస్ కూడా వారెవా అనేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోస్ ఎన్.టి.ఆర్ అరవింద సమేతను బాగా పొగిడేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇప్పటికే అరవింద సమేత రిజల్ట్ తెలుసుకుని ఎన్.టి.ఆర్ కు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది.
1

ఇక మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ట్విట్టర్ లో అరవింద సమేత గురించి పొగుడుతూ ట్వీట్ చేశాడు. యాక్టర్స్ యొక్క డెడికేషన్.. దర్శకుడి కన్విక్షన్.. ప్రొడ్యూసర్ కమిట్మెంట్ ఇవన్ని బెస్ట్ అయినప్పుడు అరవింద సమేత సినిమా వుతుందని సాయి ధరం తేజ్ ట్వీట్ చేశాడు. సినిమా చూసి ఏదో ట్వీట్ చేశాంలే అన్నట్టుగా కాకుండా తేజ్ చేసిన ట్వీట్ చూస్తుంటే సినిమా అతనికి ఎంత బాగా నచ్చిందో అర్ధమవుతుంది.

Leave a comment