ఎన్టీఆర్-అట్లీ ద్విభాషా చిత్రం..?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత తర్వాత రాజమౌళి మల్టీస్టారర్ సినిమా చేస్తాడని తెలిసిందే. అయితే అది కాకుండా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మాణంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకుడిగా కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ అట్లీ అని తెలుస్తుంది.

రాజా రాణి, తెరి, మెర్సల్ సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటడమే కాదు మూడవ సినిమాకే 200 కోట్ల దర్శకుడు అయిన అట్లీ తెలుగులో ఎన్.టి.ఆర్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఎలాగు తమిళంలో కూడా ఎన్.టి.ఆర్ ఎంట్రీ ఇద్దామని అనుకుంటున్నాడు కాబట్టి ఈ సినిమా బైలింగ్వల్ చేసే ఆలోచనలో ఉన్నారట.

అయితే ఈ ప్రాజెక్ట్ 2020 లోనే ఉంటుందని చెప్పొచ్చు. రాజమౌళి సినిమాకు కనీసం ఏడాది అయినా డేట్స్ ఇచ్చేయాల్సిందే.. సో అట్లీతో తారక్ సినిమా 2020లో కన్ ఫాం అని అంటున్నారు.

Leave a comment