దిల్ రాజుకి మరో దెబ్బ..డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ షాక్..!

రాం హీరోగా నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో వచ్చిన సినిమా హలో గురు ప్రేమ కోసమే. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. రాం సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజైంది. అయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవర్సీస్ ఆడియెన్స్ కు మాత్రం ఏమాత్రం ఎక్కలేదని చెప్పొచ్చు.

దిల్ రాజు అంచనాలు మరోసారి హలో గురు ప్రేమ కోసమే తప్పేలా చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తున్నా యూఎస్ లో ఈ సినిమా కొన్న నిర్మాతలకు నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు. దిల్ రాజు ఈ ఇయర్ నిర్మించిన లవర్స్, శ్రీనివాస కళ్యాణం సినిమాల్లానే ఈ సినిమా కూడా నిరాశ పరచే కలక్షన్స్ తెస్తుంది.

ఏపి, తెలంగాణాల్లో మాత్రం సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది. రొటీన్ కథ, కథనాలతోనే రావడం వల్ల సినిమా యూఎస్ ఆడియెన్స్ కు అంతగా రుచించలేదు.

ఏరియాల వారిగా హలో గురు ప్రేమ కోసమే నాలుగు రోజుల కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే

నైజాం : 5.50 కోటు

సీడెడ్ : 1.85 కోట్లు

ఉత్తరాంధ్ర 1.83 కోట్లు

ఈస్ట్ : 0.86 కోట్లు

వెస్ట్ : 0.60 కోట్లు

కృష్ణా : 0.88 కోట్లు

గుంటూరు : 1.08 కోట్లు

నెల్లూరు : 0.40 కోట్లు

ఏపి/తెలంగాణ : 13 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: 1.55 కోట్లు
రెస్ట్ అఫ్ వరల్డ్: 1 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్: 15.55 కోట్లు

Leave a comment