Gossipsబాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఎక్కువ కొల్లగొట్టారు..?

బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు ఎక్కువ కొల్లగొట్టారు..?

దసరా కానుకగా రామ్ హలో గురు ప్రేమ కోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. విశాల్ పందెం కోడి-2 అంటూ వచ్చాడు. రెండు సినిమాలకు యావరేజ్ టాక్ వచ్చింది. ఓ పక్క అరవింద సమేత వసూళ్లు కొద్దిగా పలచబడగా రామ్, విశాల్ కాస్త పుంజుకున్నారు. అక్టోబర్ 18న రిలీజైన ఈ రెండు సినిమాల్లో ఎవరు ఎంత తెచ్చారో చూస్తే.. రామ్ హలో గురు ప్రేమ కోసమే ఇప్పటివరకు 12.97 కోట్లు (తెలుగు రాష్ట్రాల్లో) రాబట్టింది.

ఇక విశాల్ పందెం కోడి-2 మొదటి వీకెండ్ లోనే 5.07 కోట్లు రాబట్టింది. రామ్ సినిమా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సగం మాత్రమే రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు ఇంకా సగం రాబట్టాల్సి ఉంది. విశాల్ పందెం కోడి-2 ఠాగూర్ మధు తెలుగు వర్షన్ 6 కోట్లకు కొన్నారట. ఇప్పటికే 5 కోట్లు పైగా రాగా ఈ సినిమా ఫుల్ రన్ లో లాభాలే తెచ్చి పెట్టేలా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news