చైతూపై మనసుపడ్డ శ్రీరెడ్డి..!

కాస్టింగ్ కౌచ్ మీద యుద్ధం ప్రకటించి ఆ తర్వాత టాపిక్ డైవర్ట్ అయ్యే సరికి తను కూడా టాలీవుడ్ నుండి కోలీవుడ్ కు షిఫ్ట్ అయిన శ్రీ రెడ్డి ఈమధ్య రిలీజైన శైలజా రెడ్డి అల్లుడు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది. పవర్ ఆఫ్ శైలజా రెడ్డి అంటూ శ్రీరెడ్డి శైలజా రెడ్డి సినిమాకు కంప్లీట్ రివ్యూ ఇచ్చేసింది.

శైలజా రెడ్డి సినిమా తనకు బాగా నచ్చిందని.. ఈ సినిమాతో కూల్ బోయ్ నాగ చైతన్య దూసుకెళ్తున్నాడని అన్నది. ఇక సినిమాలో అను బాగా చేసిందని.. రమ్యకృష్ణ గారికి తన శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. పవర్ ఆఫ్ శైలజా రెడ్డి అంటూ శ్రీ రెడ్డి చైతు సినిమా మీద ఇచ్చిన ఈ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ సిని జనాలను ఆకర్షిస్తుంది.

వినాయక చవితి సందర్భంగా గురువారం రిలీజైన శైలజా రెడ్డి అల్లుడు సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా కలక్షన్స్ మాత్రం చైతు కెరియర్ లో హయ్యెస్ట్ గా నిలిచేలా దూసుకెళ్తున్నాయి. మారుతి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. సినిమా పరిశ్రమ ముఖ్యంగా టాలీవుడ్ మీద ఎప్పుడూ విమర్శలు చేసే శ్రీ రెడ్డి అనూహ్యంగా శైలజా రెడ్డి అల్లుడు మీద చూపిస్తున్న సాఫ్ట్ కార్నర్ అందర్ని షాక్ అయ్యేలా చేస్తుంది.

Leave a comment