మూడవ సారి తల్లైన రంభ..!

90ల్లో హీరోయిన్ రంభ అంటే నిజంగానే ఇంద్రలోకం లో రంభ ఇలానే ఉంటుందా అనేంత క్రేజ్ తెచ్చుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు 2010లో ఇంద్ర కుమార్ ను పెళ్లాడింది. ఇప్పటికే వీరికి 8 ఏళ్ల లాస్య, 4 ఏళ్ల సాష సంతానం ఉన్నారు. అయితే ముచ్చటగా మూడవసారి మగబిడ్డకు జన్మనిచ్చింది రంభ.

తన ఇంట్లోకి మరో సభ్యుడిని ఆహ్వానిస్తున్నాం అంటూ రంభ భర్త ఇంద్ర కుమార్ ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెళ్లడించారు. హీరోయిన్ గా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన రంభ ఈమధ్య బుల్లితెర రియాలిటీ షోలో మెరిసింది. అయితే అంతగా క్లిక్ అవ్వని ఆమె ప్రస్తుతం సినిమా ప్రపంచానికి దూరంగా ఉంది.

ఈమధ్య బాగా లావెక్కిన రంభ ఎలాగు బాబుకి డెలివెరీ ఇచ్చింది కాబట్టి సన్నబడే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె సన్నబడి మళ్లీ సినిమాల్లో చేస్తే ఇప్పటి తారామణులు కూడా ఆమెకు సరిరారని చెప్పొచ్చు. ఎలాగు అక్క, వదిన పాత్రలే కాబట్టి రంభ మళ్లీ ఫ్యాన్స్ ను అలరించే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.

Leave a comment