దేవదాస్ కు నోటా షాక్.?

కింగ్ నాగార్జున, నాచురల్ స్టార్ నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్. ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా బజ్ విషయంలో దర్శక నిర్మాతలు అంతగా కాన్సెంట్రేట్ చేయడం లేదు. మల్టీస్టరర్ అంటే ఏదో వస్తుందిలే అన్నట్టుగా ఉంది. నాగ్, నానిల సినిమా మీద అంత గురి అయితే ఏం లేదు. దర్శకుడు శ్రీరాం ఆదిత్య కూడా కేవలం రెండు సినిమాలే డైరెక్ట్ చేశాడు అందుకే అతని మీద అంత హోప్స్ పెట్టుకోలేదు.

సినిమా నిర్మాత అశ్వనిదత్ కూడా చాలా చోట్ల ఓన్ గా రిలీజ్ చేస్తున్నారట. కేవలం 10 కోట్ల రూపాయల్లో సినిమా పూర్తి చేయడం ఒకటే దేవదాస్ కు ప్లస్ పాయింట్. ఇక మరో పక్క ఈ సినిమా రిలీజైన వారంలోనే విజయ్ నోటా రిలీజ్ అవుతుంది. యువ హీరోగా మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో చేస్తున్న సినిమా నోటా. దేవదాస్ వచ్చిన వారానికే నోటా వస్తుంది.

గీతా గోవిందం హిట్ తో విజయ్ క్రేజ్ డబుల్ అయ్యింది. నోటా పాజిటివ్ టాక్ వస్తే అది కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఆ వారం తర్వాత అరవింద సమేత రిలీజ్ అవుతుంది. మొత్తానికి దేవదాస్ ఏం చేసినా వారం లోనే చేయాలి. మరి విజయ్ సినిమా ఎఫెక్ట్ ఏవిధంగా దేవదాస్ మీద పడుతుందో చూడాలి.

Leave a comment