ఎన్.టి.ఆర్ బయోపిక్ పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు..!

Nagarjuna shocking comments on ntr biopic

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ మొదలు పెట్టిన సినిమా గురించి మొదటిసారి స్పందించాడు కింగ్ నాగార్జున. అసలైతే సినిమాలో ఏయన్నార్ పాత్రలో అక్కినేని ఫ్యామిలీ నుండి నాగార్జున నటిస్తారని అన్నారు. అయితే ఫైనల్ గా సుమంత్ ఏయన్నార్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. అసలు ఎన్.టి.ఆర్ బయోపిక్ పై నాగ్ స్పందన ఏంటని తెలుసుకోవాలని అందరికి ఉంది.

తాజాగా దేవదాస్ ప్రమోషన్స్ లో ఎన్.టి.ఆర్ బయోపిక్ పై తన స్పందన తెలియచేశారు నాగార్జున. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో తనని నటించమని ఎవరు అడగలేదని అన్నాడు. అసలు తనలో నాన్న గారి పోలికలు లేవు కాబట్టే తనని అడగలేదేమో.. అయితే ఏయన్నార్ లుక్ లో సుమంత్ బాగా కుదిరాడు. ఒక్క హైట్ విషయంలో తప్ప సుమంత్ ఏయన్నార్ లుక్ బాగుందని అల్లుడిపై ప్రశంసలు కురిపించాడు నాగార్జున.

అంతేకాదు ఏయన్నార్ లుక్ తో పాటుగా చంద్రబాబుగా నటిస్తున్న రానా లుక్ కూడా చాలా బాగుందని అన్నాడు నాగార్జున. నాగ్, నాని మల్టీస్టారర్ గా వస్తున్న దేవదాస్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గురువారం రిలీజ్ అవుతున్న దేవ.. దాస్ ల హడావిడి బాగానే ఉంది.

Leave a comment