డైరెక్టర్ శంకర్ కు షాక్.. మద్రాస్ హై కోర్ట్ జరిమానా..!

సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ కు మద్రాస్ హై కోర్ట్ పది వేల రూపాయల జరిమానా విధించింది. 2010లో శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఎందిరన్ సినిమా కథ తనదే అంటూ రచైత అరూర్ తమిళ్ నందన్ శంకర్ మీద కేసు వేశాడు. కొన్నాళ్లుగా తనకు న్యాయం జరిపించాలంటూ కోర్ట్ చుట్టూ తిరుగుతున్న అరూర్ తమిళ్ నందన్ కేసు హియరింగ్ రోజు శంకర్ కూడా కోర్టుకి రావాల్సిందిగా ఆదేశించింది.
3
అయితే ఎన్నిసార్లు నోటీసులు పంపించినా తన న్యాయవాదితో ఫారిన్ షూటింగ్ లో ఉన్నానని కోర్టుకి హాజరు కావడం లేదు శంకర్. ఈ విషయమై కోర్టు ఆదేశాలని ధిక్కరించినందుకు మద్రాస్ హై కోర్ట్ శంకర్ కు 10000 రూపాయల జరిమానా విధించింది. జరిమానా చిన్నదే అయినా ఈ న్యూస్ తో కోలీవుడ్ మీడియా శంకర్ ను ఓ ఆట ఆడేసుకుంటుంది.
2
ప్రస్తుతం శంకర్ రోబో సీక్వల్ సినిమా 2.ఓ ముగించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ సినిమా తర్వాత కమల్ హాసన్ తో ఇండియన్2 సినిమా కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. ఈమధ్యనే ఆ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ వచ్చింది.

1

Leave a comment