అభిమానుల దాడితో తీవ్రంగా గాయపడ్డ విజయ్..!

తమిళ హీరో విజయ్ కు అక్కడ భారీ క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో రజినికి ఈక్వల్ గా విజయ్ ఫాలోయింగ్ ఉంటుంది. అతని సినిమాల కలక్షన్స్ లెక్క అయితే సినిమా సినిమాకు మారిపోవాల్సిందే. ఫ్యాన్స్ అంతా ఇళయదళపతిగా పిలుచుకునే విజయ్ అతని ఫ్యాన్స్ వల్ల గాయాలపాలయ్యేలా చేశారు.
1
తమిళనాడులో అఖిల భారత విజయ్ ఫ్యాన్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ పాండిచ్చేరి మాజి ఎమ్మెల్యే ఆనంద్ కుమార్ కూతురు వివాహానికి అతిథిగా వచ్చాడు విజయ్. ఆ మ్యారేజ్ సంగీత్ లో సతీసమేంగా విజయ్ పాల్గొన్నాడు. అయితే విజయ్ వస్తున్నాడని ముందే తెలుసుకున్న ఫ్యాన్స్ అక్కడకు భారీగా చేరుకున్నారు.

బౌన్సర్స్ ఉన్నా సరే విజయ్ ను చూడాలని అందరు ఒక్కసారిగా మీద పడ్డారు.. దానితో విజయ్ కింద పడ్డారట. కాలికి గాయామైందని తెలుస్తుంది. మొత్తానికి ఫ్యాన్స్ వల్ల విజయ్ కు దెబ్బలు తగిలే పరిస్థితి వచ్చింది. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి లాటీచార్జ్ చేయాల్సి వచ్చిందట.

Leave a comment