అరవింద సమేత స్టోరీ లీక్

Aravindha sametha story line

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా కొద్ది ఆడియెన్స్ లో డౌట్లు ఎక్కువవుతున్నాయి. సినిమా టీజర్ లో కథ చెప్పకున్నా ఇదో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని తెలిసిపోతుంది. ఇక పాటలని బట్టి చూస్తే లవ్, ఎమోషన్, మాస్ అంశాలను కవర్ చేశాడని అనిపిస్తుంది.

అయితే త్రివిక్రం మార్క్ చూపించే డైలాగ్ పవర్ ఉండేలా జాగ్రత్త పడుతున్నా ఇది రొటీన్ రివెంజ్ డ్రామా కథ అంటున్నారు కొందరు. మొదటి భాగం సరదాగా హీరోయిన్ తో లవ్.. ఇంటర్వెల్ సీన్ లో విలన్ ఎటాక్.. ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిని చంపిన శత్రువుల కోసం హీరో రావడం ఇదే సినిమా కథ అంటున్నారు. ఆది నుండి వస్తున్న రొటీన్ ఫ్యాక్షన్ ఫార్ములా కథ ఇదే.. అయితే ఇదే కథతో అరవింద సమేత వచ్చినా త్రివిక్రం మార్క్ స్క్రీన్ ప్లే తో అలరిస్తాడని అంటున్నారు.

వేరే సినిమాలతో పోలిక పెడుతున్నా అరవింద సమేత మాత్రం కచ్చితంగా అందరి అభిమానాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Leave a comment