Gossipsఅరవింద సమేతకు మరో షాక్..లీకైన ఫోటోలు..!

అరవింద సమేతకు మరో షాక్..లీకైన ఫోటోలు..!

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత నుండి మరో పిక్ లీక్ అయ్యింది. హరికృష్ణ మరణం అనంతరం షూటింగ్ లో పాల్గొన్న ఎన్.టి.ఆర్ కారు డ్రైవ్ చేస్తూ ఉన్న పిక్ ఒకటి లీక్ అయ్యింది. ఆ పిక్ లో ఎన్.టి.ఆర్ మొహం చాలా సీరియస్ గా ఉంది. తండ్రి మరణాన్ని ఎన్.టి.ఆర్ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పొచ్చు.
9

12

98
దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న అరవింద సమేత సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఈషా రెబ్బ కూడా సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఆడియో వేడుకకు రాం చరణ్ గెస్ట్ గా వస్తారని సమాచారం. 10

7

6

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news