యూట్యూబ్ ను శాసిస్తున్న 2 . 0 టీజర్

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో సినిమా అంటే రికార్డులు బద్దలవ్వాల్సిందే. అది టీజర్, ట్రైలర్స్ నుండే మొదలవుతుందని నిరూపించారు. లేటెస్ట్ గా 2.ఓ టీజర్ వినాయక చవితి సందర్భంగా గురువారం ఉదయం 9 గంటలకు రిలీజ్ అయ్యింది. టీజర్ రిలీజైన 12 గంటల్లోనే కోటి 40 లక్షల వ్యూస్ సాధించింది. ఇక ఒక్కరోజులో 4 కోట్ల వ్యూస్ సాధించిన ఈ సినిమా 48 గంటల్లో 8 కోట్ల వ్యూస్ సాధిస్తుందని గూగుల్ గ్రాఫ్ అంచనా వేసి చెబుతుంది.

ఇప్పటికే రోబో సీక్వల్ గా వస్తున్న 2.ఓ టీజర్ ఏ ఇండియన్ సినిమా టీజర్ సృష్టించిన అరుదైన రికార్డ్ సృష్టించింది. టీజర్ లో శంకర్ ఈ సినిమాకు పెడుతున్న ప్రతి పైసా కనిపించింది. లైకా ప్రొడక్షన్స్ లో 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న 2.ఓ సినిమా నవంబర్ లో రిలీజ్ కానుంది.

టీజర్ రికార్డులు చూస్తుంటే ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంత ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారో అర్ధమవుతుంది. సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతున్న 2.ఓ టీజర్ సౌత్ లో సూపర్ అనిపించుకుంటుండగా బాలీవుడ్ లో అక్షయ్ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తుంది. సినిమాలో విలన్ గా నటిస్తున్న అక్షయ్ ను కేవలం కొన్ని క్షణాలే చూపించడం బీ టౌన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది. మరి సినిమాలో శంకర్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశాడో చూడాలి.

Leave a comment