మహర్షి సెట్ లో విజయ్ దేవరకొండ కి ఏంపని..?

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కామినేషన్ లో మహర్షి సినిమా వస్తుంది. ముగ్గురు బడా నిర్మాతలు కలిసి చేస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. మహేష్ సరసన పూజా హెగ్దె నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఓ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ లో సడెన్ గా అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ ప్రత్యక్షమయ్యాడు.

మహేష్, విజయ్, వంశీ పైడిపల్లి ముగ్గురు కలిసి దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈమధ్య విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం గురించి మహేష్ ట్వీట్ సినిమా విజయానికి ఎంతో హెల్ప్ అయ్యింది. అందుకే ఒకవేళ దాని కోసం విజయ్ మహేష్ ను కలిసి ఉండొచ్చు ఏదేమైనా మహేష్, విజయ్ కలిసి దిగిన పిక్ చూస్తే ఇద్దరు కలిసి మల్టీస్టారర్ చేస్తే అదిరిపోద్దని అంటున్నారు.

Leave a comment