కేరళ ప్రజలకు మరో రెడ్ అలర్ట్..తస్మాత్ జాగ్రత్త..!

కుంభవృష్టి లాంటి వాన వల్ల వరదలతో కేరళ మొత్తం అతలాకుతలం అయ్యింది. అక్కడ ప్రజలు కూడా వందల మంది ప్రాణాలు కోల్పోగా చాలామంది నానా ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు. దేశం మొత్తం కదిలి వచ్చి వారికి సపోర్ట్ గా నిలవాలని అంటుండగా ఇప్పుడు ప్రభుత్వం కేరళ ప్రజలకు మరో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళలో భారీ వర్షాల వల్ల అక్కడ ఇళ్లల్లో కూడా నెళ్లు వచ్చేసాయి.
11
అయితే వరదలకు అడవుల నుండి పాములు ఊళ్లల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా సరే పాములు కనిపిస్తున్నాయట. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టగా పాముల వల్ల కేరళ ప్రజలు కొత్త కష్టాలు పడాల్సి వస్తుందట. వరదలు కాస్త తగ్గుముఖం పట్టాయని ఊరిపి పీల్చుకోగా అక్కడ పాముల వల్ల మళ్లీ కష్టాలు మొదలయ్యాయని తెలుస్తుంది. కేరళ ప్రజలకు కేంద్రం నుండి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుండి చాలా మంచి సపోర్ట్ అందుతుంది. ఆస్థి నష్టం చాలా అయ్యింది కాబట్టి డొనేషన్స్ రూపంలో పెద్ద మొత్తాన్నే పొందుతున్నారు.
44

22