రచ్చ పుట్టిస్తున్న ఎన్టీఆర్ లీక్ వీడియో !

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమా నుండి లీకుల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నామధ్య ఎన్.టి.ఆర్ నాగబాబు పిక్ లీక్ అవగా ఆ ఫోటోకి కొనసాగింపుగా మరికొన్ని పిక్స్ లీక్ అయ్యాయి. రిఫరెన్స్ టూ సిజి వర్క్ అని షూటింగ్ చేసిన డేట్ కూడా ఆ రీల్ మీద ఉండటం విశేషం.4

ఎన్.టి.ఆర్ సినిమాలకే ఈ లీకుల గోల ఎక్కువైంది.. సినిమాపై అంచనాలు ఉండటం వల్లే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పొచ్చు. చిత్రయూనిట్ లోనే ఎవరో ఈ పని చేస్తున్నారని అంచనా వేయొచ్చు. మరి ఈ లీకుల మీద దర్శక నిర్మాతలు సరైన చర్యలు తీసుకుంటే బెటర్ లేదంటే సినిమా లోని సీన్స్ కూడా లీకయ్యే అవకాశం ఉంది.3

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగష్టు 15న టీజర్ రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ ఫిక్స్ అంటున్నారు.2

1

Leave a comment