ఎన్టీఆర్ కి మరో షాక్.. టీజర్ లీక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘అరవింద సమేత’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అది మరింత పెరిగింది. తారక్ సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టేందుకు రెడీ అవుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.4

3

అయితే ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించని విధంగా లీకుల సమస్య ఎదురయ్యింది. ఇప్పటికే ఈ చిత్రంలోని కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ సెట్స్‌లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. తాజాగా అరవింద సమేత చిత్ర టీజర్‌ సోషల్ మీడియాలో లీకయ్యింది. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తాము ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ లీకులు ఎలా అవుతున్నాయో వారికి అర్ధం కావడం లేదు. ఈ లీకులకు కారణం ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు చిత్ర యూనిట్.2

కాగా ఈ టీజర్‌ను ఎడిటింగ్ రూమ్‌లో నుండి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను అఫీషియల్‌గా ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.1

Leave a comment