ఇప్పుడు చూసుకోండి అంటున్న త్రివిక్రమ్.. షాక్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని లెక్కలు వేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. కాగా అరవింద సమేత టీజర్‌ చూస్తే పక్కా మాస్ చిత్రం అనే అంచనాకు వచ్చేశారు జనాలు. దీంతో త్రివిక్రమ్ మార్క్ ఈ సినిమాలో మిస్సవుతుందా అనే సందేహం వారిలో మొదలయ్యింది.

త్రివిక్రమ్ ఏమిటి మరీ ఇంత మాస్ చిత్రాన్ని తీస్తున్నాడా? అనే ప్రశ్న చిత్ర యూనిట్ వరకు చేరుకుంది. దీంతో త్రివిక్రమ్ ఈసారి తన మార్క్‌ను ప్రేక్షకులకు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రెండో టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఈ మాటల మాంత్రికుడు. ఇదే సినిమాలో ఉన్న రెండో యాంగిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి క్లాస్ జనాలతో క్లాప్స్ కొట్టించుకోవాలని చూస్తున్నాడు. అయితే మొదటి టీజర్‌లో ఒక్క ఎన్టీఆర్ తప్పితే మరెవ్వరూ కనిపించలేదు.

కానీ ఇప్పుడు రాబోయే రెండో టీజర్‌లో హీరోయిన్ పూజా హెగ్డేతో పాటు చిత్రంలోని మరికొన్ని ముఖ్యమైన పాత్రలను చూపిస్తాడట త్రివిక్రమ్. అంటే ఇదొక కంప్లీ్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే సంకేతం త్రివిక్రమ్ ఇవ్వాలని చూస్తున్నాడు. మరి ఈ రెండో టీజర్‌తోనైనా త్రివిక్రమ్ తన మార్క్ చూపిస్తాడో లేడో చూడాలి. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Leave a comment