సుమంత్ ఇదం జగత్ టీజర్ రిలీజ్..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ సినిమాలైతే చేస్తున్నాడు కాని హిట్లు మాత్రం కొట్టలేదు. కెరియర్ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్ని ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు. లాస్ట్ ఇయర్ మళ్లీరావా సినిమాతో మెప్పించిన సుమంత్ ఈసారి ఇదం జగత్ సినిమా చేస్తున్నాడు. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.

ఇందులో హీరో జర్నలిస్టుగా కనిపిస్తున్నాడు. చావు న్యూసే.. జ్ఞాపకం న్యూసే.. ప్రేమ న్యూసే.. స్నేహం న్యూసే అంటూ న్యూస్ మీద న్యూసెన్స్ ఎలా ఉండబోతుందో ఇదం జగత్ లో చూపించబోతున్నారు. సినిమా టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదం జగత్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

సుమంత్ కెరియర్ లో ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఈ సినిమా కూడా సుమంత్ కు క్రేజీ హిట్ ఇస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా సుమంత్ సుబ్రమణ్యపురం సినిమా కూడా చేస్తున్నాడు. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి.

Leave a comment