గీతా గోవిందం 3 డేస్ కలక్షన్స్.. లెక్క ఎంత..?

విజయ్ దేవరకొండ, రష్మిక లీడ్ రోల్స్ చేసిన సినిమా గీతా గోవిందం. పరశురాం డైరక్షన్ లో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ మూవీని నిర్మించారు. ఆగష్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా గీతా గోవిందం సూపర్ హిట్ అందుకుంది. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ గోవిందంగా అలరించాడు.

ఇక ఈ సినిమా మొదటి రోజు 5 కోట్లు, రెండో రోజు 4 కోట్ల దాకా కలెక్ట్ చేయగా ఏకంగా మూడు రోజుల్లో 14 కోట్ల షేర్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కు దగ్గరగా వచ్చిందని తెలుస్తుంది. పెళ్లిచూపులు 1.3 మిలియన్, అర్జున్ రెడ్డి 2 మిలియన్స్ కలెక్ట్ చేయగా గీతా గోవిందం కూడా ఓవర్సీస్ లో 2 మిలియన్ కలెక్ట్ చేసేలా కనబడుతుంది.

ఈ సినిమా కలక్షన్స్ తో విజయ్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేశాడు. కలక్షన్స్ దూకుడు చూస్తుంటే 30 కోట్లు చాలా ఈజీగా సాధించేలా ఉంది. శైలజా రెడ్డి అల్లుడు వచ్చే దాకా గీతా గోవిందం కలక్షన్స్ ను అడ్డుకునే వారే లేరని చెప్పొచ్చు.

Leave a comment