Gossipsమంచి కోరుకునే ఫ్యామిలీకే ఎందుకిలా ..?

మంచి కోరుకునే ఫ్యామిలీకే ఎందుకిలా ..?

అటు సిని ఇటు రాజకీయ రంగంలో కోట్ల మంది అభిమాన జనం ఉన్న నందమూరి ఫ్యామిలీలో ఈమధ్య వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2009లో ఎన్.టి.ఆర్ మోతే వద్ద కారు ప్రమాదం జరుగగా దానికే ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే ఎలాగోలా ఎన్.టి.ఆర్ ఆ ప్రమాదం నుండి బయట పడ్డారు. ఇక 2014లో హరికృష్ణ పెద్ద కొడుకు జానకి రాం నల్గొండ రోడ్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారు.

జానకి రాం మరణించిన నాటి నుండి ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం తమ సినిమా టైటిల్స్ ముందు రోడ్డు ప్రమాదాల మీద ఓ నోట్ చెబుతున్నారు. తమ కుటుంబంలో జరిగిన ఈ దుర్ఘటన మరే కుటుంబంలో జరుగకూడదని వారు ఈ నోట్ వేస్తూ వచ్చారు. అంతేకాదు ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి వేడుకలు పాల్గొనే టైంలో కూడా అభిమానులను జాగ్రత్తగా ఇంటికెళ్లాలని సూచిస్తారు. అలాంటి నందమూరి ఫ్యామిలీకే ఈరోజు మరో కష్టం వచ్చింది.

రోడ్డు యాక్సిడెంట్ లో హరికృష్ణ మరణం తామెంత మంచి చెబుతున్నా దేవుడు తమ మీద కనికరం చూపడేమని కుటుంబసభ్యులు అనుకుంటున్నారు. ఓ పక్క నల్గొండ బ్యాడ్ సెంటిమెంట్ తో ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లలో కూడా వణుకు మొదలైంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news