మల్టిస్టారర్ కు సర్వం సిద్ధం..!

టాలీవుడ్ లో స్టార్ హీరోల మధ్య అనుబంధం రోజు రోజుకి బలబడుతుంది. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవు మీ మధ్య కూడా ఎందుకు అంటూ స్టార్స్ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక లేటెస్ట్ గా తెలుగు స్టార్స్ లో మహేష్, ఎన్.టి.ఆర్, చరణ్ ముగ్గురు తరచు కలుస్తున్నారు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రాగా ఆ తర్వాత పార్టీలో చరణ్ యాడ్ అయ్యాడు. ముగ్గురు కలిసి దిగిన పిక్స్ అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాయి.1

ఇక మరోసారి ఆ ముగ్గురు కలిశారు. శుక్రవారం దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్ డే.. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో మహేష్, ఎన్.టి.ఆర్, చరణ్ కలిశారు. చూస్తుంటే ఈ ముగ్గురు కలిసి మల్టీస్టారర్ చేసేలా ఉన్నారని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. వంశీ లాంటి క్రేజీ డైరక్టర్ మంచి కథతో ఈ ముగ్గురు కలిసి చేసినా చేస్తారని చెప్పొచ్చు. ఆల్రెడీ రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ కలిసి చేస్తుండగా ముగ్గురు కలిసి సినిమా చేసే ఆ కిక్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.3

2

Leave a comment