రకుల్ కోరిక తీర్చిన బాలయ్య..!

టైటిల్ చూసి బాలకృష్ణ ఏంటి రకుల్ ప్రీత్ సింగ్ కోరిక తీర్చడం ఏంటని షాక్ అవ్వొచ్చు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరచుకుంటుంది. ఇక ఈమధ్యనే మహానటి బయోపిక్ చూశాక తనకు బయోపిక్ సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది రకుల్. అంతేకాదు ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని అన్నది.

అలా తన కోరిక వెళ్లబుచ్చిందో లేదో బాలయ్య బాబు రకుల్ కోరికను తీర్చేశాడు. ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఆమెను సెలెక్ట్ చేశారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ జీవిత కథలో ఆమె హీరోయిన్ శ్రీదేవిగా కనిపించనుందట. ఇప్పటికే యుక్తవయసు ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ నటిస్తున్నాడని తెలియగా శ్రీదేవిగా రకుల్ మెప్పించబోతుందట.

ఒక్క ప్రభాస్ తో తప్ప స్టార్స్ అందరిని ఓ రౌండ్ వేసిన రకుల్ ప్రెస్టిజియస్ బయోపిక్ లో నటించడం ఆమె కెరియర్ కు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం సుకుమార్ డైరక్షన్ లో మహేష్ చేస్తున్న 26వ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ను ఫైనల్ చేశారని టాక్.

Leave a comment