టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ చావుదెబ్బ..!

ఇంగ్లాండ్ లో ఘోర వైఫల్యం చవిచూసిన టీం ఇండియా అక్కడ కసి తీర్చుకునే సమయం కోసం ఎదురుచూడగా ఆరోజు రానే వచ్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న సీరీస్ లో భాగంగా మొదటి టి20లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి ఇంగ్లాండ్ ఆటగాళ్లకు బుద్ధి చెప్పింది.

సొంత గడ్డపై ఇంగ్లాండ్ ను ఓడించాలనే కసితో ఇండియా జట్టు మొదటి టి20 సూపర్ హిట్ కొట్టింది. ఆస్ట్రేలియాతో సీరీస్ లో విజయం సాధించి మంచి ఫాంలో ఉన్నట్టు కనిపించిన ఇంగ్లాండ్ జట్టు విజయానికి బ్రేక్ వేసింది కొహ్లి జట్టు. మొదట టాస్ గెలిచిన కొహ్లి బౌలింగ్ ఎంచుకోగా కుల్ దీప్ సింగ్ బౌలింగ్ లో ఆ జట్టు కుప్పకూలింది. ఏకంగా కుల్ దీప్ 5 వికెట్లు తీశాడంటే అతని బౌలింగ్ ఏ రేంజ్ లో వర్క్ అవుట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.

ఫైనల్ గా 159 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు ఇండియా విజయాన్ని ఆపలేకపోయింది. కే.ఎల్ రాహుల్ 101 అజేయంగా నిలబడటంతో 18.2 ఓవర్లకే భారత జట్టు విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ అవతల ఎండ్ లో 32 పరుగులతో జట్టు విజయంలో సపోర్ట్ ఇచ్చాడు. మొత్తానికి ఇంగ్లాండ్ మొదటి టి20 ఇండియా అద్భుత విజయాన్ని అందుకుంది.

Leave a comment