ఎన్టీఆర్ వదిలినా విశ్వరూపం-2 ట్రైలర్..!

కమల్ హాసన్ దర్శక నిర్మాణంలో వస్తున్న సినిమా విశ్వరూపం-2. 2013లో వచ్చిన విశ్వరూపం సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. 2015 లోనే మొదలుపెట్టిన ఈ సినిమా ఇన్నాళ్లకు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రిలీజ్ చేశారు. ఒక మనిషి ఎన్నో ముఖాలు.. ఈ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు గొప్పగా భావిస్తున్నా అంటూ విశ్వరూపం-2 ట్రైలర్ రిలీజ్ చేశారు ఎన్.టి.ఆర్.

టెర్రరిసం బ్యాక్ డ్రాప్ తో విశ్వరూపం సినిమా సూపర్ హిట్ అవగా ఆ సినిమాకు సీక్వల్ గా ఈ పార్ట్-2 వస్తుంది. చూస్తుంటే ఈ సినిమా కూడా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పొచ్చు. సినిమా మేకింగ్ పరంగా కూడా అద్భుతంగా ఉందనిపిస్తుంది. యాక్షన్, స్టంట్స్ అన్ని ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి.

విశ్వరూపం రిలీజ్ టైం లో తమిళనాడులో ఉద్రిక్త వాతావరణం ఉంది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. టెర్రరిజం పై కమల్ చేసిన విశ్వరూపం-2 ఎలా ఉండబోతుందో చూడాలి. ఆగష్టు 10న ఈ సినిమా రిలీజ్ అవనుంది.

Leave a comment