Movies" శంభో శంకర " రివ్యూ & రేటింగ్

” శంభో శంకర ” రివ్యూ & రేటింగ్

జబర్దస్త్ లో కామెడీ స్కిట్ లతో అలరించిన షకలక శంకర్ కమెడియన్ గా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు హీరోగా తొలిప్రయత్నం చేశాడు. శంభో శంకర అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శంకర్. శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజేశ్వర రెడ్డి, సురేష్ కొండేటి నిర్మించారు. కారుణ్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందించారు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

అంకాళ్లమ్మ పల్లెలో ప్రెసిడెంట్ గా ఉండే అజయ్ ఘోష్ అక్కడ ఊరి వారిని ఇబ్బందులు పెడుతుంటాడు. ఎదురుతిరిగే ధైర్యం ఉన్నా సమయం కోసం ఎదురుచూసిన శంకర్ ఒకానొక సందర్భంలో ప్రెసిడెంట్ ను డీ కొడతాడు. ప్రెసిడెంట్ కు ఎదురుతిరిగాడని శంకర్ కు రావాల్సిన పోలీస్ జాబ్ రానివ్వకుండా చేస్తాడు. అంతేకాదు అతని చెల్లి చనిపోడానికి కారణమవుతాడు. ఆ పగతో ప్రెసిడెంట్ ను ఏవిధంగా శిక్షించాడు అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ హీరోగా చేసిన మొదటి ప్రయత్నం శంభో శంకర. ఈ సినిమాలో శంకర్ తన కామెడీ యాంగిల్ కాకుండా మిగతా యాంగిల్స్ చూపించాడు. ఓ మాస్ హీరో మార్క్ క్యారక్టరైజేషన్ కనిపిస్తుంది. కారుణ్య నటన బాగుంది. అజయ్ ఘోష్ విలనిజం ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్ని అల్రించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ సోసోగానే ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ మాస్ బీట్ ఓకే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలరిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అంతగా బాగాలేదు. తక్కువ బడ్జెట్ లో కానిచ్చేసినట్టు తెలుస్తుంది. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం ప్రతిభ చూపించలేదు. రొటీన్ పంథాలోనే సాగడం విశేషం.

విశ్లేషణ :

ప్రెసిడెంట్ వల్ల నష్టపోతున్న ఊరు, ప్రజలను కాపాడే మొనగాడిగా శంభో శంకర అంటూ వచ్చాడు షకలక శంకర్. ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో ఈ సినిమాలో అలరించాడు. అయితే అతను ఏవిధమైన కామెడీతో ఆడియెన్స్ కు చేరువయ్యాడో ఆ కామెడీ మాత్రం పండించలేదు శంకర్.

కామెడీ తప్ప మిగతావన్ని చేశాడు.. సినిమా అంతా పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తుంది. రొటీన్ కథ, దానికి తగినట్టుగానే కథనం సాగుతాయి. హీరోగా బాగా కష్టపడినట్టు అనిపించినా ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం విఫలమయ్యాడు శంకర్.

కమెడియన్స్ హీరోగా మారడం ట్రెండ్ అయ్యింది. సునీల్, సప్తగిరి ఇప్పుడు శంకర్ అయితే వీరు హీరోలుగా కొనసాగించేంత స్టఫ్ అయితే లేదు. వారు చేసే కామెడీ పాత్రలు చేస్తూ ఇలా ప్రయోగాలు చేస్తే బెటర్.

ప్లస్ పాయింట్స్ :

షకలక శంకర్

డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ కథ

ప్రొడక్షన్ వాల్యూస్

మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్

రేటింగ్ : 1.5/5

బాటం లైన్ :

శంభో శంకర.. షకలక శంకర్ వృధా ప్రయత్నం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news