Newsబాహుబలి తర్వాత రంగస్థలం అదిరిపోయే రికార్డ్..!

బాహుబలి తర్వాత రంగస్థలం అదిరిపోయే రికార్డ్..!

బాహుబలి తర్వాత కలక్షన్స్ లో రంగస్థలం రికార్డులు సృష్టించింది. అయితే కేవలం బాహుబలి వసూళ్లతోనే కాదు పాటల్లో కూడా రంగస్థలం రికార్డుల్లోకి ఎక్కింది. రంగస్థలం లోని రంగమ్మా.. మంగమ్మా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. లిరికల్ వీడియో 70 మిలియన్ల హిట్లు సాధించగా.. వీడియో సాంగ్ 50 మిలియన్ల హిట్లు సాధించింది.

ఈ రెండు కలుపుకుంటే 120 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో రంగమ్మా అదరగొట్టింది. అయితే బాహుబలిలోని అన్ని పాటలు మిలియన్ వ్యూస్ సాధించగా.. సాహోరే బాహుబలి, దండాలయ్య సాంగ్ ఎక్కువ హిట్లు సాధించాయి. బాహుబలిలోని ఈ సాంగ్స్ 100 మిలియన్ వ్యూస్ సాధించాయి. బాహుబలి సినిమాలోని పాటల తర్వాత రంగమ్మా.. మంగమ్మా సాంగ్ మాత్రమే ఆ ఫీట్ సాధించింది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని ట్యూన్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. సినిమా హిట్ కు మ్యూజిక్ కూడా ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక రంగమ్మ సాంగ్ లో సమంత క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ పాటకి మిలియన్ వ్యూస్ వచ్చేలా చేశాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news