Gossipsవివాదాల్లో 'యన్.టి.ఆర్ ' బయోపిక్..!

వివాదాల్లో ‘యన్.టి.ఆర్ ‘ బయోపిక్..!

మొదలుపెట్టిన నాటి నుండి ఎన్.టి.ఆర్ బయోపిక్ కు అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. తేజ మొదలుపెట్టిన ఈ సినిమా అతను బయటకు వెళ్లగా ప్రస్తుతం క్రిష్ చేతుల్లోకి వచ్చింది. సినిమాలో ఫైనల్ కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేస్తున్న ఈ తరుణంలో జూలై 5 నుండి మళ్లీ షూటింగ్ కు రెడీ అవుతున్నారు. ఈ టైంలో మాజీ సిఎం నాదెండ్ల భాస్కర రావు తనయుడు ఎన్.టి.ఆర్ బయోపిక్ కు నోటీసులు పంపించాడు.

సినిమాలో నాదెండ్ల భాస్కర రావు పాత్ర కూడా ఉంటుందని తెలుస్తుంది. భాస్కర రావుగా సచిన్ కేడ్కర్ ను సెలెక్ట్ చేశారట. బయోపిక్ లో తన తండ్రిని నెగటివ్ షేడ్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నారని నోటీసులో ఉంది. ఎన్.టి.ఆర్ గొప్ప వ్యక్తి ఆయన బయోపిక్ తీయడంలో తప్పులేదు కాని తన తండ్రిని నెగటివ్ గా చూపిస్తారన్న ఉద్దేశంతో నోటీసులు పంపించారు.

మరి ఈ విషయంపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎన్.బి.కె ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో విద్యా బాలన్, రానా, మహేష్ బాబు కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news