బిగ్ బాస్-2 లో నాని ఎన్టీఆర్ ని మరిపించాడా ?

ఆడియెన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా షో మొదలైంది. కేవలం కంటెస్టంట్స్ ను పిలవడం వారిని హౌజ్ లోకి పంపించడం ఇది మాత్రమే జరిగింది. స్టార్ హోస్ట్ గా నాని నిన్నటి ఎపిసోడ్ లో అయితే పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక కంటెస్టంట్స్ గా వచ్చిన వారిలో 13 మంది కాస్త తెలిసిన వారే వారు సెలబ్రిటీస్ అనలేము. మిగతా ముగ్గురు ఆడియెన్స్ లోంచి వచ్చిన వారు.

మొత్తానికి 16 మంది కంటెస్టంట్స్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. నాని కనిపించేది మళ్లీ వచ్చే శనివారమే.. ఈలోగా బిగ్ బాస్ హౌజ్ లో ఏం జరుగుతుందోచూడాలి. అయితే నిజం చెప్పాలంటే నాని కేవలం స్క్రిప్ట్ చదివినట్టే అనిపించింది. ఎన్.టి.ఆర్ లా ఉత్సాహం కనబరచలేదు అన్నది అందరి మాట.అయిత్ మొదటి షో తోనే నాని ని జడ్జి చేయటం భావ్యం కాదు కాబట్టి.. కొన్ని రోజుల తర్వాత నాని ఇంకాస్త మెరుగుగా తన నేచురల్ పెర్ఫార్మన్స్ తో అదరగొడతాడని ఆశిద్దాం.

Leave a comment