Newsబిగ్ బాస్ కంటెస్టంట్స్.. ఎక్కడ నుండి తెచ్చారండి బాబు వీళ్లని..!

బిగ్ బాస్ కంటెస్టంట్స్.. ఎక్కడ నుండి తెచ్చారండి బాబు వీళ్లని..!

స్టార్ మా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ఆదివారం సీజన్ 2 మొదలవగా 16 మంది కంటెస్టంట్స్ తో నాని హోస్ట్ గా గ్రాండ్ గా ఈ షో మొదలైంది. ఎన్.టి.ఆర్ అంత ఎనర్జీ కనిపించకున్నా నాని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. అయితే కంటెస్టంట్స్ గా వచ్చిన వారు కూడా అంత గుర్తింపు ఉన్న వారు కాకపోవడం ఆడియెన్స్ ను నిరాశపరచింది.

ఉన్న 16 మంది కంటెస్టంట్స్ లో తనీష్, యాంకర్ దీప్తి, హీరోయిన్ తేజశ్విన్, సింగర్ గీతా మాధురి, విలన్ అమిత తివారి, డిబెట్లు చేసే బాబు గోనినేని కాస్త అందరికి తెలిసిన వారు. ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన దీప్తి సునైన, ఆర్టిస్ట్ భాను శ్రీ, రోల్ రిదా, యాంకర్ శ్యామలా, కిరీటి దామరాజు, కౌశల్, సామ్రాట్ వీరిని చూసి గుర్తుపట్టేంత సెలబ్రిటీస్ కాదు.

ఇక వీరే కాకుండా ఆర్జే గణేష్, సంజనా, నూతన్ నాయుడు కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చారు. కచ్చితంగా ఈ ముగ్గురిని ఆడియెన్స్ రిజిస్టర్ చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. బిగ్ బాస్ 1 లో కాస్త కూస్తో అందరు తెలిసిన వారే.. సీజన్ 2 కు మాత్రం అంత ప్రాముఖ్యత ఉన్న వారిని తీసుకోలేదు. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news