టైమింగ్ అదిరింది.. భరత్ అనే నేను డైలాగ్ తో పవన్ కళ్యాణ్..!(వీడియో)

పోరాట యాత్ర అంటూ ప్రజల్లోకి వచ్చిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ అయిన టిడిపిని దుయ్యబడుతున్న జనసేన అధికారి రాజకీయ నేతలను నిలదీస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరికి ప్రజల పట్ల గౌరవం ఉండాలని.. పొలిటిషియన్స్ కు జవాబుదారితనం ఉండాలని అన్నారు.

అయితే అకౌంటబిలిటీ అనగానే మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో మహేష్ ప్రస్తావించిన పనితీరు గుర్తొస్తుంది. ప్రజల ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకులు పనితీరుని ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరికి ఎకౌంటబిలిటీ గురించి మహేష్ చెబుతాడు. ఇక అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా జవాబుదారితనం గురించి చెప్పుకొచ్చాడు.

ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు దొరికినంత దోచుకుంతింటుంటే ఇక జవాబుదారితనం ఎక్కడ ఉంటుందని. వారి తింటున్నారు కాబట్టే ఎదురుతిరిగి మాట్లాడే ధైర్యం లేకుండా పోయిందని అన్నారు. పోరాట యాత్రలో అధికార పార్టీని టార్గెట్ చేస్తూ పవన్ ప్రసంగం సాగడం విశేషం.

Leave a comment