Gossipsమంచు సామ్రాజ్యం కుప్పకూలిందా..?

మంచు సామ్రాజ్యం కుప్పకూలిందా..?

కలక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చి హీరోగా స్థిరపడ్డాడు. తన మార్క్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టే మోహన్ బాబు తన నట వారసత్వాన్ని ఎవరికి ఇవ్వలేకపోయాడు. ఉండటానికి వారసులిద్దరు ఉన్నా వారు ఒకరు కామెడీ సినిమాలు మరొకరు ఎవరికి ఎక్కని ప్రయోగాలు చేస్తూ వచ్చారు.

ఇక మంచు వారసురాలిగా లక్ష్మి నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్నా ఆమెకు సరైన అవకాశాలు లేవని చెప్పాలి. అందుకే స్మాల్ స్క్రీన్ పై ఆమె అడుగులేసింది. ప్రస్తుతం ఆమె లీడ్ రోల్ గా వైహాఫ్ రాం గా వస్తుంది. విజయ్ ఎలకంటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఈమధ్యనే రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకు అంత పాజిటివ్ బజ్ లేదని చెప్పొచ్చు.

ఇక రీసెంట్ గా వచ్చిన మంచు ఫ్యామిలీ హీరో విష్ణు ఆచారి అమెరికా యాత్ర కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మంచు మనోజ్ సినిమాలైతే అడపాదడపా వస్తున్నా అవి కూడా ప్రేక్షకాదరణ నోచుకోవట్లేదు. ఓ మోస్తారు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ మంచు ఫ్యామిలీ హీరోలు ఇలా వరుస ఫ్లాపులు తీయడంతో వెనుకపడ్డారని చెప్పొచ్చు. మరి సినిమాల సెలక్షన్స్ లో మంచు హీరోలు ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకుంటే మంచిందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news