Gossipsఅక్కడ బన్నికి దెబ్బేసిన రాం చరణ్.. మాటల్లేవు మాట్లాడుకోటాల్లేవ్..!

అక్కడ బన్నికి దెబ్బేసిన రాం చరణ్.. మాటల్లేవు మాట్లాడుకోటాల్లేవ్..!

రంగస్థలంతో రికార్డుల మోత మోగిస్తున్న రాం చరణ్ కెరియర్ లో మెగా హీరోలందరిలో (చిరు, పవన్ లు కాకుండా) ముందుండాలని ప్రయత్నాలు చేశాడు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస విజయాలతో దూసుకెళ్తూ సంచలనం సృష్టిస్తున్న బన్ని ఒకానొక దశలో చరణ్ ను బీట్ చేశాడన్న టాక్ వచ్చింది.

మెగా వారసుడిగా రాం చరణ్ ధ్రువతో ట్రాక్ లోకి వచ్చినా అసలు సిసలు తన సత్తా చాటేలా చేసింది మాత్రం రంగస్థలమే. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో వసూళ్ల సునామి సృష్టిస్తుంది. ఇన్నాళ్లు అక్కడ 1 మిలియన్ కూడా కలక్షన్స్ సాధించిన చెర్రి ధ్రువతో ఆ ఫీట్ సాధించగా రంగస్థలం సినిమాతో ఏకంగా 2 మిలియన్ అది కూడా 4 రోజుల్లోనే క్రాస్ చేశాడు. ఇక వసూళ్ల హడావిడి చూస్తుంటే రంగస్థలం యూఎస్ లో 3 మిలియన్ మార్క్ టచ్ చేసినా చేయొచ్చని అంటున్నారు.

ఈ లెక్కన చూస్తే కేవలం 1.5 మిలియన్ కలక్షన్స్ తోనే ఉన్న బన్ని ఓవర్సీస్ బాక్సాఫీస్ రికార్డును చరణ్ బద్ధలు కొట్టాడని చెప్పొచ్చు. స్టార్ సినిమా సూపర్ హిట్ టాక్ వస్తే ఇక ఆ సినిమా వసూళ్ల లెక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రస్తుతం రంగస్థలం వసూళ్లు అలానే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news