టాప్ 5 లో భరత్.. మహేషా మజాకా..!

సూపర్ స్టార్ మహేష్ స్టామినాను ప్రూవ్ చేస్తూ లేటెస్ట్ రిలీజ్ భరత్ అనే నేనుతో బాక్సాఫీస్ మీద యుద్ధం ప్రకటించాడు. ముఖ్యంగా ఓవర్సీస్ లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న మహేష్ ఈ సినిమాతో మరోసారి అక్కడ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయిన 4వ రోజు వసూళ్లతోనే ఓవర్సీస్ లో టాప్ 5 లిస్ట్ సినిమాల్లో చేరిపోయింది.

ప్రీమియర్స్ తో కలిపి మొదటి రోజే 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టిన భరత్ అనే నేను సినిమా సోమవారం కల్లా 2.5 మిలియన్ డాలర్లు సాధించింది. సోమవారం కలక్షన్స్ తో ఖైది నంబర్ 150, అ ఆ లను క్రాస్ చేశాడు మహేష్. బాహుబలి 2, బాహుబలి బిగినింగ్, రంగస్థలం, శ్రీమంతుడు తర్వాత భరత్ అనే నేను 5వ స్థానంలో ఉన్నాడు.

చూస్తుంటే శ్రీమంతుడు, రంగస్థలం సినిమాలను కూడా దాటేసి 3వ స్థానంలో నిలబడే పరిస్థితి కనబడుతుంది. లెక్క చెప్పి మరి హిట్ కొట్టిన మహేష్ ను చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను డివివి దానయ్య నిర్మించారు.

Leave a comment