భరత్ అనే నేను రివ్యూ

bharat ane nenu review

కథ :

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో డిగ్రీ పొందిన భరత్ (మహేష్) తన తండ్రి చనిపోయాడని తెలుసుకుని ఇండియాకు వస్తాడు. తండ్రి తర్వాత సిఎం కుర్చి కోసం కొట్లాట జరుగుతుండగా తండ్రి స్నేహితుడైన వరదరాజు (ప్రకాశ్ రాజ్) భరత్ ను సిఎం అవమని అంటాడు. సిఎం అయిన భరత్ ప్రజలను, రాజకీయ నేతలను ఎలా మార్చాడు అన్నదే సినిమా కథ.

 

నటీనటుల ప్రతిభ :

భరత్ పాత్రలో మహేష్ నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు మహేష్. ముఖ్యంగా అసెంబ్లీ ఎపిసోడ్స్ లో మహేష్ అదరగొట్టాడు. ఇక హీరోయిన్ కైరా అద్వాని కూడా బాగానే చేసింది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, రావు రమేష్ అందరు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మహేష్ ను చాలా అందంగా చూపించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. సినిమా టేకింగ్ ఫస్ట్ క్లాస్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. రన్ టైం ఎక్కువ ఉన్నా సమస్యలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడు కొరటాల శివ కథ కథనాల్లో తన పట్టు చూపించాడు.

 

విశ్లేషణ :

మహేష్ సినిమా అనగానే ఉండాల్సిన కమర్షియల్ అంశాలన్నిటిని కలిపి భరత్ అనే నేను సినిమా వచ్చింది. సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడు. ఓ బాధ్యత గల సిఎం ఎలా ఉండాలో చూపించాడు కొరటాల శివ. కథ చెప్పేందుకు చాలా పెద్దది. అయితే దానికి రాసుకున్న కథనం బాగుంది.

సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ షో చేశాడు. డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్ సీన్స్ హైఎలెట్స్ అని చెప్పొచ్చు. మాస్ ప్రియులకు నచ్చే మంచి సినిమాగా కొరటాల శివ భరత్ అనే నేనుని మలిచారు.

సినిమా ఫస్ట్ హాఫ్ అలా అలా నడుస్తుంది.. అయితే సెకండ్ హాఫ్ బాగా ఎంటర్టైన్ అవుతారు. ఓవరాల్ గా సినిమా ఓ మంచి అనుభూతిని కలిగిస్తుంది.

 

ప్లస్ పాయింట్స్ :

మహేష్

కథనం

ప్రొడక్షన్ వాల్యూస్

ప్రీ క్లైమాక్స్ సీన్

 

 

మైనస్ పాయింట్స్ :

పెద్దగా ఏమి లేవు

 

బాటం లైన్ :

భరత్ అనే నేను.. ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండనిపించే సినిమా..!

 

రేటింగ్ : 3.75/5

Leave a comment