నదియా, ఖుష్బుల తర్వాత ఎన్టీఆర్ సినిమాలో ఆ సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ తో త్రివిక్రమ్ ప్రయోగం..!

త్రివిక్రం సినిమాల్లో హీరోలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో సపోర్టింగ్ ఆర్టిస్టులకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. రెండు దశాబ్ధాల క్రితం అలరించిన నదియాను అత్తారింటికి దారేది సినిమాతో సూపర్ క్రేజ్ వచ్చేలా చేశాడు. ఇక ఆమెనే తర్వాత సినిమాలో కూడా కొనసాగించాడు. ఇక రీసెంట్ గా అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బుకి మంచి పాత్ర ఇచ్చాడు త్రివిక్రం.

అయితే అజ్ఞాతవాసి వల్ల ఖుష్బుకి అంత లాభం జరుగలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో నిన్నటి హీరోయిన్ లయను తీసుకుంటున్నారట. యంగ్ టైగర్ సినిమాలో లయ ఉందంటూ ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ న్యూస్ పై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. పదేళ్ల క్రిత హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న లయ ప్రేమించు సినిమాతో నంది అవార్డును సైతం సంపాదించింది.

తెలుగు హీరోయిన్ అయిన లయ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందని తెలుస్తుంది. మరి త్రివిక్రం, తారక్ నిజంగానే లయను సెలెక్ట్ చేశారా లేదా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. హరిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న మొదలు కాబోతుంది.

Leave a comment