20 లక్షల హృదయాలను గెలుచుకున్న యంగ్ టైగర్ !!

సినీ అభిమానులు ఇంతకు ముందు తమకిష్టమైన ఏ హీరో గురించైనా లేదా హీరోయిన్ గురించైనా తెలుసుకోవాలంటే ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా పై ఆధారపడేవాళ్లు. కానీ సోషల్ మీడియా వచ్చిన దగ్గరనుండి తమకిష్టమైన సెలబ్రిటీ తో డైరెక్ట్ గా మాట్లాడే/ చాట్ చేసే అవకాశం వచ్చింది. ఇక హీరోలు హీరోయిన్లు కూడా తమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయానికొస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో కొంత చురుకుగానే ఉంటాడు. ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఎక్కువగా స్పందించే ఎన్టీఆర్ ట్విట్టర్ లో 2 మిలియన్ల మార్కుని దాటేశాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు #2MFollowersForNTR హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ ట్విట్టర్ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Leave a comment