Moviesరవితేజ ఎంత టచ్ చేస్తే హిట్ అవుతాడో తెలుసా ?...

రవితేజ ఎంత టచ్ చేస్తే హిట్ అవుతాడో తెలుసా ? పూర్తి బిజినెస్ వివరాలు..!

మాస్ మహరాజ్ రవితేజ రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా హిట్ మేనియాను కంటిన్యూ చేసేలా టచ్ చేసి చూడు సినిమాతో వస్తున్నాడు రవితేజ. రేపు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరిపోయింది. రాజా ది గ్రేట్ 30 కోట్ల షేర్ వసూళ్లను సాధించగా ఇప్పుడు టచ్ చేసి చూడు కూడా టోటల్ వరల్డ్ వైడ్ 26 కోట్ల పైన ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట.

నైజాంలో 7.2 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్ల బిజినెస్ చేసిన టచ్ చేసి చూడు సీడెడ్ లో 4 కోట్లు టచ్ చేసిందట. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు రెస్ట్ ఆఫ్ ఇండియా 40 లక్షలు, కర్ణాటక 1.5 కోట్లు బిజినెస్ చేసిందట. ఇక ఓవర్సీస్ లో 2 కోట్ల దాకా బిజినెస్ చేసిందట. ఓవరాల్ గా 25 కోట్ల పైన బిజినెస్ చేసిన రవితేజ టచ్ చేసి చూడు హిట్ అనాలంటే 26 కోట్ల పైన వసూళ్లను రాబట్టాలి.

మాస్ రాజా కు ఉన్న ఫాలోయింగ్ కు సినిమా హిట్ టాక్ వస్తే చాలు ఇదేం పెద్ద విషయమేం కాదని అంటున్నారు. విక్రం సిరికొండ డైరక్షన్ లో వచ్చిన టచ్ చేసి చూడు సినిమాలో రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. నల్లమలపు శ్రీనివాస్, వళ్లభనేని వంశీ కలిసి ఈ సినిమా నిర్మించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news