రజినీకాంత్ కి షాక్ ఇచ్చిన భాగమతి..!

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన సినిమా భాగమతి. ఈ ఇయర్ మొదటి హిట్.. ప్రేక్షకుల హృదయాలను గెలిచిన సినిమాగా భాగమతి క్రేజ్ తెచ్చుకుంది. సినిమాలో అనుష్క నటనకు అందరు ఫిదా అవుతున్నారు. పిల్లజమిందార్ అశోక్ భాగమతితో మరోసారి తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ స్వీటీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక కోలీవుడ్ సూపర్ స్టార్.. తలైవా రజినికాంత్ కూడా భాగమతి చూసి అనుష్కకు కాల్ చేశారట. అనుష్క నటన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించి మెచ్చుకున్నట్టు టాక్. సూపర్ స్టార్ కాల్ తో భాగమతి టీం అంతా మరింత ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా హిట్ కు అనుష్కతో పాటుగా ఆర్ట్ డైరక్టర్, మ్యూజిక్ డైరక్టర్, ప్రొడక్షన్ వాల్యూస్, కాస్ట్ అండ్ క్రూ అంతా సహకరించారు.

ఏదైనా ప్రయత్నం మంచిది అయితే తన తరపున ప్రశంసలను అందించే రజిని భాగమతి టీం కు తన కృతజ్ఞతలను అందించారట. తెలుగులో తీసిన భాగమతి సినిమా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ అయ్యింది. జనవరి 26న వచ్చిన ఈ సినిమా పారిక కోట్ల షేర్ వాల్యూస్ తో ఈ ఇయర్ మొదటి సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

Leave a comment