టాప్ 25 టి.ఆర్.పి రేటింగ్ సినిమాలివే.. బుల్లితెర మీద ఇంతకన్నా బీభత్సం ఏది లేదు..!

స్టార్ సినిమా అంటే కలక్షన్స్ వస్తేనే సూపర్ హిట్ అన్న రోజులు మారాయి. సినిమా ఎలా ఉన్నా కలక్షన్స్ వస్తుండగా అసలు హిట్ అన్నది ఆ సినిమా క్రియేట్ చేసే రికార్డులతో ముడిపడి ఉంటుంది. టీజర్ దగ్గర నుండి ఆ సినిమా టివిల్లో వచ్చాక కొల్లగొట్టే టి.ఆర్.పి రేటింగులతో కూడా ఫ్యాన్స్ రికార్డులంటూ హంగామా చేస్తున్నారు. అవును టాలీవుడ్ టాప్ సినిమాలే కాదు సిల్వర్ స్క్రీన్ మీద ఆడని సినిమాలు కూడా బుల్లితెర మీద భ్రహ్మాండంగా ఆడేశాయి.

స్మాల్ స్క్రీన్ పై టి.ఆర్.పి తుక్కు రేగ్గొట్టిన సినిమాల లిస్ట్ ఎలా ఉందో చూడండి. ముఖ్యంగా ఈ లిస్ట్ లో టాప్ 25 సినిమాలు తీసుకోవడం జరిగింది. మాములుగా అయితే టాప్ ప్లేస్ లో కచ్చితంగా బాహుబలి 1, 2 పార్టులలో ఏదో ఉంటుందని అనుకుంటారు. కాని టెంపర్ సినిమా అత్యధికంగా 26 టి.ఆర్.పి పాయింట్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది.

ఆ తర్వాత మగధీర 24 టి.ఆర్.పి పాయింట్స్ తో రెండవ స్థానంలో ఉంది. బాహుబలి-2 22.70తో మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత శ్రీమంతుడు 22.54తో నాల్గవ స్థానం.. 21.70తో దువ్వాడ జగన్నాథం 5వ స్థానంలో ఉన్నాయి.

ఇక బాహుబలి ది బిగినింగ్ 21.54 రేటింగ్ తో 6వ స్థానంలో ఉండగా.. 7వ స్థానంలో ఫిదా 21.31 టృఫ్ రేటింగ్ లో ఉంది. ఆ తర్వాత 8 వ పొజిషన్ లో జనతాగ్యారేజ్ 20.69. 9 పొజిషన్ అత్తారింటికి దారేది 19.84. 10వ స్థానంలో రోబో 19.04 ఉన్నాయి.
ఇక 11 నుండి 25 వరకు లిస్ట్ లో సినిమాలు ఎలా ఉన్నాయంటే..
11.బిచ్చగాడు – 18.76 రేటింగ్
12. గబ్బర్ సింగ్ – 18.52
13. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు – 18.42
14. దృశ్యం – 18.12
15. ఈగ – 18.06
16. రేసుగుర్రం – 18.01
17. సన్ ఆఫ్ సత్యమూర్తి – 17.38
18. దూకుడు – 17.20
19. అల్లుడుశీను – 16.91
20. శ్రీరామదాసు – 16.24
21. ఒక లైలా కోసం – 16.05
22. ఆటోనగర్ సూర్య – 15.95
23. గోవిందుడు అందరివాడేలే – 15.86
24. రారండోయ్ వేడుక చూద్దాం – 15.65
25. సినిమా చూపిస్త మావ – 15.21

Leave a comment