పరారీలో ప్రదీప్.. సాటి యాంకర్ల కామెంట్స్ ఇలా..?

బుల్లితెర మీద తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్న యాంకర్ ప్రదీప్ న్యూ ఇయర్ పార్టీలో బుక్కయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అడ్డంగా బుక్ అయిన ప్రదీప్ కౌన్సెలింగ్ కూడా రాకుండా పరారీలో ఉన్నాడని అంటున్నారు. పిలిచిన టైం కల్లా ప్రదీప్ రాకుంటే చార్జ్ షీట్ ఫైల్ చేస్తామని చెప్పినా సరే ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాలేదట.

అయితే ఈ వ్యవహారంపై మీడియా రాస్తున్న కథనాలపై స్పందించారు సాటి యాంకర్లు సుమన్, అనసూయ. ప్రదీప్ తమతో బాగా ఉంటాడని.. మంచి వ్యక్తి అని అంటున్నారు. సుమ మాత్రం తాగి డ్రైవ్ చేయడం తప్పే అతని పని చట్టం చూసుకుంటుంది కాని సోషల్ మీడియా మాత్రం వారి కుటుంబం బాధపడేలా కథనాలు రాస్తుందని అన్నారు.

ఇక ఇదే విషయంపై స్పందించిన అనసూయ.. న్యూ ఇయర్ పార్టీలో తాగడం తప్పేం కాదు కాకపోతే సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. అయితే మీడియా మరి ప్రదీప్ గురించి రకరకాల వార్తలను రాస్తుందని బాధపడ్డారు అనసూయ.

Leave a comment