Gossipsతారక్ సినిమాపై త్రివిక్రం.. అసలు విశ్వరూపం చూపిస్తాడట..!

తారక్ సినిమాపై త్రివిక్రం.. అసలు విశ్వరూపం చూపిస్తాడట..!

అజ్ఞాతవాసి సినిమాకు ముందు ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న తారక్ త్రివిక్రం కాంబో సెట్ అయ్యిందని సంతోషపడ్డారు. కాని ఎప్పుడైతే అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యిందో అంచనాలు తారుమారయ్యాయి. త్రివిక్రం సినిమా అంటే వామ్మో అంటున్నారు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్. అయితే ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి త్రివిక్రం కసితో సినిమాలు చేశాడు. ఖలేజా ఫ్లాప్ తర్వాత జులాయి తీసి హిట్ అందుకోగా.. సన్నాఫ్ సత్యమూర్తి అంచనాలను అందుకోకపోయినా ఆ తర్వాత అ ఆతో హిట్ కొట్టాడు.

అజ్ఞాతవాసి పోయినా సరే తారక్ సినిమా మాత్రం త్రివిక్రం విశ్వరూపం చూస్తారని అంటున్నారు. ఈ సినిమా మొదలు పెట్టడానికి ముందే కథ కథనాల మీద పూర్తి స్థాయిలో పర్ఫెక్షన్ వచ్చేలా చేస్తున్నారట. ఇక సినిమా ఎన్.టి.ఆర్ క్రేజ్ ను డబుల్ చేసేలా తనకు లోటుగా ఉన్న ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చేలా తీయాలని ఫిక్స్ అయ్యాడట.

తారక్ తో త్రివిక్రం మూవీ కూడా రాధాకృష్ణ నిర్మాణంలో వస్తుంది. ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తాడని తెలుస్తుంది. మరి అంచనాలను అందుకునేలా ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news