తమిళనాడు లో సంచలనాలకి సన్నద్ధమైన జై లవ కుశ..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వచ్చిన సినిమా జై లవ కుశ. ఎన్.టి.ఆర్ నట విశ్వరూపాన్ని చూపించేలా వచ్చిన ఈ సినిమాలో తారక్ మూడు విభిన్న పాత్రల్లో అలరించాడు. 2017 దసరా బరిలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. తన నటనా ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు నీరాజనాలు అందించారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై తమిళ హీరోల కన్ను పడ్డదట. సినిమాలో తారక్ చేసిన మూడు షేడ్స్ చూసి షాక్ అయ్యారట. తారక్ అంత విజృంభణ ఉన్నా లేకున్నా సినిమా పాయింట్ బాగుండటంతో సినిమా రీమేక్ చేయాలని చూస్తున్నారట. ప్రస్తుతం తమిళ హీరోలు సూర్య, అజిత్ ల పేర్లు జై లవ కుశ హీరోలుగా వినిపిస్తున్నాయి. సూర్య ఎప్పుడు ప్రయోగాలకు ప్రాధాన్యత ఇస్తుంటాడు.

నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేసి మెప్పించాడు. అందుకే సూర్యనే మొదటి ప్రిఫరెన్స్ అంటున్నారు. ఇక జై లవ కుశ సినిమా మీద అజిత్ కూడా మనసు పారేసుకున్నాడట. ఎన్.టి.ఆర్ నటన చూసి షాక్ అయిన అజిత్ తమిళంలో ఈ సినిమా రీమేక్ చేయాలని సన్నిహితులతో అన్నాడట. మొత్తానికి జూనియర్ జై లవ కుశ తమిళనాట కూడా సంచలనానికి సిద్ధమైందని చెప్పొచ్చు.

Leave a comment