Gossipsమహేష్ కథ కూడా కాపీనా.. సంచలనం సృష్టిస్తున్న న్యూస్..!

మహేష్ కథ కూడా కాపీనా.. సంచలనం సృష్టిస్తున్న న్యూస్..!

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కాపీ వివాదం మెడకు చుట్టుకుంటుంది. సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కాపీ అంటూ ముందు వార్తలు రాగా.. ఏకంగా లార్గో వించ్ సినిమాను యాజిటీజ్ దించేశాడు త్రివిక్రం శ్రీనివాస్. త్రివిక్రం లాంటి డైరక్టర్ ఇంత దారుణంగా కాపీ చేస్తాడా అన్నది హాట్ న్యూస్ గా మారింది.

అయితే ఇప్పుడు అజ్ఞాతవాసి దారిలోనే మరో స్టార్ సినిమా కూడా కాపీ వివాదం ఎదుర్కొనబోతుందని తెలుస్తుంది. అదే సినిమా అంటే మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అనే నేను అని అంటున్నారు. శ్రీమంతుడు తర్వాత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కథ 90ల్లో వచ్చిన ఓ హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ వార్తలు వస్తున్నాయి.

అంతేకాదు ఈ సినిమా కథను కొరటాల శివ శ్రిహరి నాను అనే రచయిత దగ్గర నుండి కోటి రూపాయలు ఇచ్చి కొన్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కథ కూడా హాలీవుడ్ సినిమాకు కాపీ అంటూ వార్తలు మొదలయ్యాయి. అజ్ఞాతవాసి ఎపిసోడ్ చూశాక కూడా మహేష్ కొరటాల అలాంటి తప్పే చేస్తే ఎలా అంటున్నారు కొందరు. అయితే అజ్ఞాతవాసి సినిమాకు వస్తున్న విమర్శలు చూసి భరత్ అనే నేను టీం ముందు జాగ్రత్తలు పడుతుందని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news