Gossipsఫ్యాన్స్ ను పట్టించుకోని మహేష్.. తాను మాత్రం ఫుల్ హ్యాపీ..!

ఫ్యాన్స్ ను పట్టించుకోని మహేష్.. తాను మాత్రం ఫుల్ హ్యాపీ..!

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ ఏంటో తెలిసిందే. కరెక్ట్ సినిమా పడితే ఇండస్ట్రీ రికార్డులను సైతం బద్ధలు కొట్టే స్టామినా ఉన్న మహేష్ ఈమధ్య వరుస ఫ్లాపులను చవిచూస్తున్నాడు. బ్రహ్మోత్సవం డిజాస్టర్ కాగా ఎన్నో అంచనాలతో వచ్చిన స్పైడర్ కూడా నిరాశ పరచింది. అయితే ప్రస్తుతం కొరటాల శివతో భరత్ అను నేను సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా విషయంలో ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాడు.

షూటింగ్ కు గ్యాప్ ఇచ్చి ఎంచక్కా ఒమన్ చెక్కేసిన మహేష్ అక్కడ ఫ్యామిలీతో పారాగ్లైడింగ్ ట్రై చేశాడు. ఫ్యామిలీఇ మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే మహేష్ ఫ్యాన్స్ ను పట్టించుకోవట్లేదని టాక్. న్యూ ఇయర్ గిఫ్ట్ గా కనీసం నటిస్తున్న సినిమా లుక్ రివీల్ చేయకుండా నిరాశ పరచాడు. పోని సినిమా టైటిల్ రివీల్ చేయడం ఇష్టం లేకపోతే కనీసం విశెష్ చెబుతూ ఓ పోస్టర్ అయినా రిలీజ్ చేస్తే బాగుండేదని అంటున్నారు.

ఈమధ్య అభిమానులకు మహేష్ కు కాస్త దూరం ఏర్పడింది. కేవలం అవసరం ఉన్నప్పుడే ట్విట్టర్ లో మెసేజ్ పెట్టే మహేష్ ఫ్యాన్స్ గురించి కాస్త ఆలోచిస్తే బెటర్ అని అంటున్నారు. స్పైడర్ విషయంలో ఇలా నాన్చబట్టే సినిమా తేడా కొట్టేసిందని అంటున్న వారు ఉన్నారు. మరి మహేష్ ఫ్యాన్స్ అభ్యర్ధనను అర్ధం చేసుకుంటాడనే ఆశిద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news